
సాక్షి, హైదరాబాద్: అల్పపీడనం మంగళవారం బలహీన పడింది. ద్రోణి సగటు సముద్ర మట్టం మధ్య విస్తరించి ఉంది. దీంతో రాగల మూడు రోజులు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగూడెం, పాల్వంచలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జూలూరుపాడులో 4, అశ్వారావుపేట, బూర్గంపాడు, ఇల్లందు, టేకులపల్లి, వెంకటాపురాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment