
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మంగళవారం జరగనున్న బంద్‌కు మద్దతు తెలుపుతూ కీలక నేతలు ధర్నాల్లో పాల్గొననున్నారు. షాద్‌నగర్ జాతీయ రహదారిపై ధర్నాలో కేటీఆర్.. సిద్ధిపేట హైవేపై ధర్నాలో హరీష్‌రావు.. నిజామాబాద్ హైవేపై ధర్నాలో కవిత పాల్గొననున్నారు. ( ఢిల్లీలో ఉగ్ర కలకలం..!)
4 గంటలు మాత్రమే భారత్ బంద్
న్యూఢిల్లీ : మంగళవారం జరగనున్న రైతుల భారత్ బంద్ సమయంలో మార్పు చోటుచేసుకుంది. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. 4 గంటలు మాత్రమే భారత్ బంద్ చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా బంద్ వేళలలో మార్పులు చేశామని తెలిపాయి. కాగా, భారత్ బంద్ నేపథ్యంలో రేపు ఎక్కడ లారీలు అక్కడే నిలిపివేయాలని లారీల యజమానుల సంఘం నిర్ణయించింది.