పులుకుర్తి గ్రామస్తులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచె
వరంగల్ అర్బన్,దామెర: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదై.. లాక్ డౌన్ విధించిన తొలిరోజుల్లో పలు గ్రామాల ప్రజలు తమ ఊరికి ఎవరూ రావొద్దంటూ పొలిమేరల్లో కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే పలు కారణాలతో ఆ కంచెలు తొలగించడం.. ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు మళ్లీ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పసరగొండ గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆగ్రామం నుంచి ఎవరూ తమ గ్రామానికి రావొద్దంటూ పులుకుర్తి గ్రామస్తులు తమ ఊరి పొలిమేరలో కంచె ఏర్పాటు చేసి రాకపోకలను నిలువరించారు. సర్పంచ్ అశోక్, ఉపసర్పంచ్ రాజు మాట్లాడుతూ సమీప గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గ్రామస్తుల కోరికమేరకు పొలిమేరలో కంచె ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment