నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుల కుమారులు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డికి ప్రచారంలో అగ్రబాగాన నిలిచారు. సీనియర్ నాయకుడు యడవెల్లి రంగశాయిరెడ్డి కుమారుడు యడవెల్లి వల్లభ్‌రెడ్డి, నిడమనూరుకు చెందిన మేరెడ్డి వెంకట్రాహుల్ కుమారుడు మేరెడ్డి వివేక్‌కృష్ణ, నిడమనూరు సర్పంచ్ మేరెడ్డి పుష్పలత కుమారుడు శ్రీనివాసరెడ్డి కుమారుడు మేరెడ్డి వెంకట్, కుందూరు లక్ష్మారెడ్డి కుమారుడు దేవేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు మాజీ ఎంపీపీ చేకూర హన్మంతరావు కుమారుడు చేకూరి శంశీచరణ్ కాంగ్రెస్‌లో చేరి జయవీర్ తరఫున విస్తృ త ప్రచారం ఇర్వహించారు.
నిడమనూరుకు చెందిన మేరెడ్డి వెంకట్ అమెరికా నుంచి, కుందూరు దేవేందర్‌రెడ్డి కెనడా నుంచి వచ్చి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనుముల మండలం ఇబ్రహీంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత యడవెల్లి నరేందర్‌రెడ్డి కుమారుడు వంశీకృష్ణారెడ్డి సైతం జయవీర్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశారు.
మేరెడ్డి వెంకట్రాహుల్ కుమారుడు మేరెడ్డి వివేక్‌కృష్ణ ప్రచారంలో ఎంతో కలివిడిగా ప్రజలతో మమేకమయ్యాడు. కొన్ని గ్రామాల్లో ఓటర్లు కుందూరు జానారెడ్డి కుమారుడు ఎవరు, ఏడీ అని అడిగిన వారికి వారిని వాహనం వద్దకు తీసుకెళ్లి ఇతనే కుందూరు జయవీర్‌రెడ్డి అని చెప్పి పరిచయం చేశాడు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అంకతి సత్యం కూడా దివంగత సీనియర్ నేత అంకతి వెంకటయ్య కుమారుడే, మండల యూత్ అధ్యక్షుడు నర్సింగ్ విజయ్ కుమార్‌గౌడ్ కూడా సీనియర్ నాయకుడు నర్సింగ్ కృష్ణయ్య కుమారుడే కావడం గమనార్హం. యువ రక్తంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఆకట్టుకున్నారు. ఆదివారం వెబడే ఫలితాలపై వీరి ప్రభావం ఎంత ఉంటుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment