సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులకు చేసిందేమీ లేదు కాబట్టి.. రాజీనామా చేస్తారా?.. అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మంత్రి కేటీఆర్‌ను ప్ర శ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు చూపిస్తే రాజీనామా చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. రుణమాఫీ చేయడం లేదని రాజీనామా చేస్తారా? అని ఆదివారం ట్విట్టర్ వేదికగా షర్మిల నిలదీశారు.
రైతులు పంట నష్టపోతే ఆదుకోవడానికి పంట బీమా అమలు చేయడం లేదని రాజీనామా చేస్తారా?.. లేక నష్టపోయిన రైతుకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించడం లేదని రాజీనామా చేసారా?.. రైతు బీమా రైతులందరికీ అందించడం లేదని రాజీనామా చేస్తారా? అని నిలదీశారు. ఈ విషయంలో ఇప్పటికే తమ పార్టీ తరపున హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైతు బీమా అమలు విషయంలో హైకోర్టు ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వానికి ఆరు వారాల గడువు ఇచ్చినట్టు పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణలో కౌలు రైతును గుర్తించడం లేదంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment