ముఖ్యమంత్రికి సాదర స్వాగతం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదివారం రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రజాప్రతినిధులు సాదర స్వాగతం పలికారు.
– 10లో
పోయినేడు గొప్పగా జరుపుకున్నాం
నాపేరు నానాకిలే. భర్త లేడు. ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేశా. అల్లుళ్లు, కూతుర్లు నాతోనే ఉంటారు. చేపల వేటకు వెళితే కానీ ముద్ద రాదు. రెండు నెలలుగా చేపల వేట లేదు. తుపాను వస్తుంది వెళ్లొద్దని సారు వాళ్లు చెప్పారు. బువ్వకి కూడా ఇబ్బందిగా ఉంది. పోయినేడు ఇదే పెద్ద పండుగను ఎంతో గొప్పగా జరుపుకున్నాం. ఆ ఏడు ప్రభుత్వం నుంచి మా కుటుంబానికి రూ.1.21 లక్షలు వచ్చాయి. కొత్త బట్టలు తెచ్చుకున్నాం. ఇంట్లో నిండుగా సరుకులు ఉండేవి. వేట విరామ సమయంలో ప్రభుత్వం వెంటనే డబ్బులు, బియ్యం ఇచ్చేది. ఈ ఏడు సర్కారు నుంచి ఎటువంటి డబ్బులు రాలేదు. బియ్యం కూడా ఇవ్వలేదు. ఇంట్లో ఆరుగురు ఉన్నాం. పూట గడవటమే కష్టంగా ఉంది. అప్పు చేసి ఓ పూట తిని మరో పూట పస్తు ఉంటుంన్నాం.
అప్పట్లో అన్నీ అందేవి
నా పేరు కోగిలి జాలమ్మ. నాకు ఇద్దరు ఆడబిడ్డ లు. నా మొగుడు వేటకు వెళితేగాని పూటగడవదు. రెండు నెలలుగా వేట లేదు. ఏం చేయాలి? ఇదిగో ఇలా కూర్చొని ఒకరి కష్టం ఒకరు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాం. అప్పట్లో మాకు అన్నీ అందేవి. నాడు– నేడు అంట, దాని ద్వారా ఇదిగో బడి బాగుపడింది. నా బిడ్డలను చదువుకు పంపుతు న్నా. నిరుడు ఈయాలికంతా రూ.81వేలు వచ్చింది. ఆ డబ్బులతో పండక్కి గుడ్డలు, వస్తువులు కొనుక్కున్నాం. సచివాలయం వాళ్లు వచ్చి వెళ్లేవా రు. మాకు ఏం కావాలో అడిగేవారు. మాకు తెలవకపోయినా వాళ్లే చెప్పేవారు. పేపర్లు అన్నీ రాసిచ్చి డబ్బులు వచ్చేలా చేసేవారు. ఈ ఏడు ఒక్క రూపాయి రాలేదు. ఎలా పండగ జరుపుకోవాలి. పూటగడిస్తే చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం సామీ.
సందడే లేదు
నా పేరు రామయ్య. మా ఇంట్లో ఆరుగురు ఉంటాం. కొడుకులు, కోడళ్లు ఉన్నారు. చేపల వేటే మాకు జీవనాధారం. నేను, నా కొడుకు చేపల వేటకు వెళ్లేవాళ్లం. అటువంటిది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపల డిపార్ట్‌మెంట్‌లో నాకు చిన్న ఉద్యోగం వచ్చింది. దీంతో వేటకు వెళ్లకపోయినా ఆ ఉద్యోగంతో అంతో ఇంతో కుటుంబం గడిచిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో మా కుటుంబానికి రూ.78వేల వరకు వచ్చాయి. ప్రస్తుతం అయితే ఎటువంటి పథకాలు అందలేదు. దీనికితోడు వేట లేకపోవడంతో ఊర్లో ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో ఉన్నారు. పూట గడిచేందుకే అవస్థలు పడుతున్నారు. దీంతో మా ఊర్లో సంక్రాంతి పండుగ సందడి లేదు.
ముఖ్యమంత్రికి సాదర స్వాగతం
ముఖ్యమంత్రికి సాదర స్వాగతం


