తవ్వేస్తూ.. తరలిస్తూ!
తిరుపతి రూరల్: మండలంలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. తవ్వుకున్నోళ్లకు.. తవ్వుకున్నంత అన్నట్టు యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా స్వర్ణముఖి నది నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ..తరలిస్తున్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా ట్రాక్టర్‌లు, లారీలు, టిప్పర్‌లతో చైన్నె, బెంగుళూరుకు రవాణా చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. టీడీపీ నేతల అండతోనే ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని స్థానికులు, తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
నిత్యం వందల టన్నులు
ప్రధానంగా దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లి, చిగురు వాడ, కేసీపేట, తణపల్లి, కుంట్రపాకం, తిరుచానూరు ప్రాంతాల్లో స్వర్ణముఖి నదిని యధేచ్చగా తవ్వేస్తున్నారు. నిత్యం వందల టన్నుల ఇసుకను సరిహద్దులు దాటించేస్తున్నారు. అక్రమార్కుల ఆగడాలతో రాత్రివేళ పొలం వద్దకు వెళ్లేందుకు సైతం రైతుల వణికిపోతున్నారు. నదిలో యంత్రాల సాయంతో లోతుగా తవ్వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని వాపోతున్నారు.
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
టీడీపీ నేతల అండతో అక్రమార్కుల దందా
పట్టించుకోని అధికారులు
స్వర్ణముఖిలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో జోరుతూ అక్రమార్కులకు సహకారం అందిస్తున్నారని విమర్శిస్తున్నారు. సాక్షాత్తు ఆర్‌డీఓ ఆదేశాలు జారీ చేసినా బేఖాతర్ చేస్తున్నారని మండిపడుతున్నారు.
తవ్వేస్తూ.. తరలిస్తూ!
Comments
Please login to add a commentAdd a comment