నాయకులను అడ్డుకున్న పోలీసులు
తిరుపతి మంగళం : ‘చంద్రబాబు అబద్ధపు హామీలపై ప్రజాగొంతుకై ప్రశ్నించే హక్కు వైఎస్సార్‌సీపీ నేతలకు లేదా..?’ అంటూ ఆ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూ పర్‌సిక్స్ హామీల అమలుపైన గురువారం తిరుపతికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించేందుకు బయలుదేరిన భూమన అభినయ్‌రెడ్డితోపాటు ఆ పార్టీ శ్రేణులను పద్మావతిపు రంలోని పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసు లు నిర్బంధించారు. సీఎంను కలవడానికి వీల్లేదంటూ గేట్లు మూసేశారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా రోప్‌లతో అడ్డుకున్నా రు. దాంతో పార్టీ కార్యాలయం వద్దే బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం అభినయ్‌రెడ్డి మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి తొమ్మిది నెలలవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాటలు తప్ప చేతల్లో ఏదీ చేయడం లేదన్నారు. నిర్బంధించిన వారిలో పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్, కార్పొరేటర్ తమ్ముడు గణేష్, టౌన్‌బ్యాంక్ వైస్‌చైర్మన్ వాసుయాదవ్, పార్టీ నాయకులు నల్లాని బాబు, కడపగుంట అమరనాఽథ్, దినేష్‌రాయల్, అనీల్‌రెడ్డి, పసుపులేటి సురేష్, మద్దాలి శేఖర్, మల్లం రవి, సుధాకర్, కోటి, రమణమ్మ, సాయికుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా?