
25న ఏఎల్‌సీసీ విడుదల
తిరుపతి కల్చరల్: ఒక బ్యాచిలర్ తన జీవితంలో కష్టాలు ఎదుర్కొని ఎలా అనుకున్న లక్ష్యాన్ని సాధించారనే ఇతివృత్తంతో చక్కటి సందేశాత్మకంగా రూపొందించిన ‘ఏఎల్‌సీసీ’ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలవుదని చిత్ర దర్శకుడు లేలీధర్ రావు తెలిపారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సినిమాకు సంబంధించిన పోస్టర్ స్టిల్స్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ చిత్రాన్ని 90 శాతం తిరుపతికి చెందిన నటీనటులతో తిరుపతి పరిసర ప్రాంతాల్లో రూపొందించామని తెలిపారు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు జరిగే సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చేలా తీర్చిదిద్దినట్టు వెల్లడించారు. సమావేశంలో నటీనటులు ధనుస్ దేవర, శ్రీనివాసులురెడ్డి, కమల్, జశ్వంత్, చరణ్ తేజ పాల్గొన్నారు.
పోలీసులకు
ఉద్యోగ విరమణ సన్మానం
తిరుపతి క్రైం: జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి నలుగురు పోలీసులు ఆదివారం ఉద్యోగ విరమణ పొందారు. వీరిలో ఏఎస్‌ఐలు ప్రసాద్, శివకుమార్, శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి ఉన్నారు. వీరిని జిల్లా లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ రవి మనోహరాచారి ఘనంగా సత్కరించారు. వారి సేవలను ప్రస్తుతించారు.

25న ఏఎల్‌సీసీ విడుదల