తిరుపతి కల్చరల్: అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 1న మంగళవారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహిస్తారు. 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం జరుగనుంది. 9వ తేదీన ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం, 22న శ్రవణ నక్షత్రం సందర్భంగా ఉదయం 10.30 గంటలకు కల్యాణోత్సవం జరుగనుంది.
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
బాలాయపల్లి(సైదాపురం): మండలంలోని వెంగమాంబాపురం గ్రామానికి చెందిన రైతు సాధనాల పద్మయ్య నాయుడు(35) విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. గురువారం పొలంలో సాగు నీరందించేందుకు మోటారు వేయగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. మృతునికి భార పద్మ, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
52 ఏళ్ల వ్యక్తికి
మహిళ గుండె అమరిక
తిరుపతి తుడా: 52 ఏళ్ల వ్యక్తికి 45 సంవత్సరాల మహిళ గుండెను విజయవంతంగా అమర్చారు. తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చికిత్సను వైద్యులు విజయవంతంగా చేపట్టారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలోని ఆరుగురు వైద్యులు గురువారం రాత్రి 10.10 గంటలకు గుండె మార్పిడి చికిత్సను ప్రారంభించి.. శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగించారు.
సుష్మ బ్రెయిన్ డెడ్
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సీహెచ్ సుష్మ (48) రమేష్ హాస్పిటల్‌లో ఈ నెల 23వ తేదీన అడ్మిట్ అయ్యారు. తలకు తీవ్ర గాయాలవ్వడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. వైద్యానికి స్పందించకపోవడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అవయవ దానానికి ముందుకొచ్చారు.
పురుషుడికి మహిళ గుండె
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో గత కొన్నాళ్లుగా బాధపడుతున్నాడు. పరీక్షించిన వైద్యులు గుండె పూర్తిగా క్షీణించిందని నిర్ధారించారు. ఖరీదైన వైద్యం కావడంతో తెలిసిన వాళ్ల ద్వారా తిరుపతి శ్రీ పద్మావతి హృదయాలయానికి వచ్చారు. ఈ క్రమంలో సుష్మా కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు రావడంతో వివరాలు తెలుసుకున్న పద్మావతి ఆస్పత్రి వైద్యుల బృందం అక్కడికి చేరుకుంది. గుండెను సేకరించి గ్రీన్ చానల్ ద్వారా తిరుపతికి తరలించి 52 సంవత్సరాల వ్యక్తికి అమర్చారు.
అప్పలాయగుంటలో విశేష ఉత్సవాలు
అప్పలాయగుంటలో విశేష ఉత్సవాలు


