ఉన్నత లక్ష్యంతో ఉజ్వల భవిత | - | Sakshi
Sakshi News home page

ఉన్నత లక్ష్యంతో ఉజ్వల భవిత

Mar 28 2025 2:11 AM | Updated on Mar 28 2025 2:05 AM

తిరుపతి కల్చరల్‌: పట్టుదల, క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించినప్పుడే ప్రతి విద్యార్థి జీవితం ఉజ్వల భవిషత్‌ అవుతుందని, ఆ దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని డీఆర్‌డీవో పూర్వ చైర్మన్‌ సతీష్‌రెడ్డి పిలుపు నిచ్చారు. సి గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల 16వ వార్షికోత్సవాన్ని గురువారం మహతి కళాక్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వార్షిక వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ పరంగా ప్రస్తుతం మన దేశం అగ్రరాజ్యాలతో సమానంగా ఉందన్నారు. ప్రత్యేకించి డిఫెన్స్‌, అంతరిక్ష పరిశోధనల్లో ముందంజలో ఉందని తెలిపారు. విద్యార్థులను ఇన్‌స్పైర్‌ చేయడానికి పేదరికం స్వయం కృషితో సొంత కంపెనీలను లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఫలితంగా ఎందరో విజయం సాధించిన వ్యక్తుల గురించి వివరించారు. అనంతరం కళాశాల చైర్మన్‌ వై.కొండారెడ్డి మాట్లాడుతూ మేలైన సమాజ స్థాపనకు ఉపాధ్యాయుడు ఎంత ముఖ్యమో వివరించారు. కళాశాల కార్యదర్శి వై.ఆంనదరెడ్డి, వైస్‌ చైర్మన్‌ వై.విజయ్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ రాజశేఖర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉన్నత లక్ష్యంతో ఉజ్వల భవిత1
1/1

ఉన్నత లక్ష్యంతో ఉజ్వల భవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement