అడుగడుగునా ఆటంకాలు
రామకుప్పం మండలంలో 16 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను 8 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉన్నారు. టీడీపీకి ఆరుగురు ఉండగా ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. అధికార పార్టీ నేతలు బెదిరింపులు, ప్రలోభాలు పెట్టి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణు లు 8 మంది ఎంపీటీసీ సభ్యులను కర్ణాటకకు తరలించారు. అక్కడి నుంచి గురువారం ఉదయం వి.కోటలోని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు స్వగృహానికి తరలించారు. ఎంపీపీ ఎన్నిక కోసం 11 గంటలలోపు ఎంపీటీసీ సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంది. వి.కోట నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు రామకుప్పం బయలుదేరగా మార్గం మధ్యలో టీడీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నారు.


