● రేపు కచ్చపి ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం
తిరుపతి కల్చరల్: సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఉగాది సంబరాలను అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. ‘సాక్షి’ అందిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఏబీ ఎలక్ట్రానిక్స్ గౌరవ స్పాన్సర్‌గా, కో స్పాన్సర్‌గా అమిగోస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, అన్నమాచార్య యూనివర్సిటీ, శుభమస్తు షాపింగ్‌మాల్, కెనరా బ్యాంకు సహకారం అందించనున్నాయి. ఈ ఉగాది వేడుకల్లో కళాత్మకమైన, తెలుగుదనం ఉట్టిపడేలా కూచిపూడి నృత్యం, బాల బాలికలచేత సంప్రదాయ వస్త్రధారణ, తెలుగు పద్యాల పోటీలు, అవధానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం పంచాంగ శ్రవణం చేపట్టనున్నారు. భవిష్యత్ మీకు ఏమి అందిస్తుందనే విషయాలను ‘సాక్షి’ పంచాంగం శ్రవణం ద్వారా తెలియజేయనున్నారు. ఈ సంప్రదాయ ఉగాది వేడుకల్లో ప్రజలందరూ పాల్గొనాలని ర్వాహకులు విజ్ఞప్తి చేశారు.


