కనువిందుగా సంప్రదాయ వస్త్ర ప్రదర్శన
విద్యార్థినీ విద్యార్థులు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రదారణతో పోటీల్లో పాల్గొన్నారు. వివిధ దేవతామూర్తులు, పంచకట్టు, పట్టుచీరలు వంటి అలంకరణలో వేదికపై ప్రదర్శన ఇచ్చారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరో ఐదుమందికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులతో ఆడిటోరియం కిక్కిరిసింది. వచ్చిన ప్రతి వ్యక్తికి ఉగాది పచ్చడితో పాటు, అల్పాహారంతో కూడిన గిఫ్ట్ బ్యాగ్‌లను అందజేశారు. కార్యక్రమంలో ఏజీఎం డీజీఎం శ్రీనివాస్, బీఎం సత్యేంద్రబాబు, ప్రొడక్షన్ ఆర్‌ఎం రాజా, ఏడీవీటీ మేనేజర్ బి.వెంకటరత్నం, ఎడిషన్ ఇన్‌చార్జి ఎండ్లూరి మోహన్, బ్యూరో ఇన్‌చార్జి తిరుమల రవిరెడ్డి, సర్కులేషన్ ఏజీఎం రమణ పాల్గొన్నారు.


