న్యాయం చేయాలని వినతి
తిరుపతి అర్బన్ :ఎస్వీయూ కో–ఆపరేటివ్ స్టోర్, ఎల్‌పీజీ గ్యాస్ సెంటర్‌లో నాలుగు ఏళ్ల నుంచి పనిచేస్తున్నామని, అకారణంగా అధికారులు తొలగించారని, తమకు న్యాయం చేయాలని టర్మినేట్ అయిన ఉద్యోగులు కోరారు. బుధవారం ఈ మేరకు కలెక్టర్‌కు విన్నతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా సహకార శాఖ అధికారులు తమను రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తమతో చెప్పినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తొలగింపునకు గురైన ఉద్యోగులు లక్ష్మీదేవి, స్రవంతి, సాగర్, గురవారెడ్డి, సుబ్రమణ్యం, సత్యవేలు, సయ్యద్‌బాషా, మునెయ్య, వెంకటేష్, తులసీప్రియ, నాగరాజు, రాజమోహన్, లోకేష్‌రెడ్డి, పరంధామ, జగదీష్, మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.
కొండను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
చంద్రగిరి : తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిపై భాకరపేట కనుమలో బుధవారం ఆర్టీసీ బస్సు కొండను ఢీకొంది. చోటు చేసుకుంది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ముప్పు తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు.
‘వక్ఫ్’ బిల్లుపై ఆందోళన
తిరుపతి మంగళం :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్‌బోర్డ్ బిల్లుపై వైఎస్సార్‌సీపీ ముస్లిం నేతలు ఆందోళనకు దిగారు. బుధవారం ఈ మేరకు పద్మావతిపురంలో వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనార్టీ జోనల్ విభాగం అధ్యక్షుడు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి మాట్లాడుతూ ముస్లింల భూములను కొట్టేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలతో వక్ఫ్‌బోర్డ్ బిల్లును ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఇతర కుల మతాలకు కూడా అన్యాయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనకాడవని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం వక్ఫ్‌బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిలకు మద్దతు తెలపడం అభినందనీయమన్నారు. కూటమి పాలనలో ముస్లింలకు చీకటి రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఖాదర్‌బాషా, షేక్ ఇమ్రాన్, గఫూర్, హాజీ షేక్ ఫరీతాప్, షేక్ సలీమ్, ఎస్‌కే కలీమ్, ఎస్.అమీర్‌బాషా పాల్గొన్నారు.
న్యాయం చేయాలని వినతి


