‘ఉబర్’ సమస్యల పరిష్కారానికి వినతి
తిరుపతి మంగళం : ఉబర్ సంస్థ కారణంగా తలెత్తిన సమస్యలు పరిష్కరించాలని వాహన యజమానులు కోరారు. బుధవారం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఉబర్ వాహన యజమానులతో డీటీడీఓ మురళీమోహన్ సమావేశం నిర్వహించారు. ప్రయాణ చార్జీలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని విన్నవించారు. తిరుపతి రైల్వే స్టేషన్, విమానాశ్రయంలో పార్కింగ్ ఇబ్బందులను తొలగించాలన్నాఉ. ఉబర్ సంస్థ వైఖరికి నిరసనగా సమ్మె చేస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీటీఓ మాట్లాడుతూ ఉబర్ వాహన యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంవీఐ సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, మోహన్ కుమార్, పరిపాలనాధికారి విజయ ప్రశాంతి, సీనియర్ సహాయకుడు చరణ్ చక్రవర్తి పాల్గొన్నారు.


