జిల్లా మత్స్యశాఖ ఇన్‌చార్జిగా రాజేష్
● డీడీ నాగరాజుకు ఉద్యోగోన్నతి
తిరుపతి అర్బన్: మత్స్యశాఖ జిల్లా అధికారిగా పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ నాగరాజుకు జాయింట్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి క ల్పించారు. ఆ మేరకు ఆయన కాకినాడకు బదిలీ అయ్యారు. గూడూరు డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా(ఏడీ) పనిచేస్తున్న రాజేష్ కు జిల్లా మత్స్యశాఖ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు రాజేష్ తిరుపతి అలిపి రి రోడ్డులోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు నాగరాజు తిరుపతి జిల్లా నుంచి రిలీవ్ అయి, కాకినాడకు వెళ్లారు. రెండేళ్లుగా జిల్లా మత్స్యశాఖ డీడీగా నాగరాజు విధులు నిర్వహించారు.
జిల్లా మత్స్యశాఖ ఇన్‌చార్జిగా రాజేష్


