బ్రాండ్‌ అంబాసిడరా? | - | Sakshi
Sakshi News home page

బ్రాండ్‌ అంబాసిడరా?

Apr 4 2025 1:53 AM | Updated on Apr 4 2025 1:53 AM

బ్రాండ్‌ అంబాసిడరా?

బ్రాండ్‌ అంబాసిడరా?

రియల్‌ ఎస్టేట్‌కి శ్రీవారు
● దీనికి ఆగమశాస్త్ర సలహాలు తీసుకోవాలని చెప్పడం దారుణం ● కూటమి హయాంలో దిగజారిన టీటీడీ ప్రతిష్ట ● మీ పాలనకు నిరసనగా సాధువులు, స్వాములు ఆందోళన చేయలేదా? ● కొండపై విచ్చలవిడిగా మద్యం, మాంసం ● మంత్రి నారా లోకేష్‌ పీఏ రోజూ 10 –13 సిఫార్సు లెటర్లు జారీ ● టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి

వైఎస్సార్‌సీపీ హయాంలోనే నాణ్యమైన లడ్డూ

తిరుమల లడ్డూ నాణ్యత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హ యాంలోనే పెరిగిందని భూమన కరుణాకరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలతో శ్రీవారి అన్న ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయించారన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 3, 4 వేల లోపు వీఐపీ దర్శనాలుంటే కూటమి పాలనలో రోజుకు ఏడు వేలకు పెరిగాయన్నారు. మంత్రి నారా లోకేష్‌ పీఏ సాంబశివరావు రోజుకు 10 నుంచి 13 సిఫార్సు లెటర్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి నేతలు వీఐపీ సేవల్లో తరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలన లో భక్తులకు మేలు జరిగిందని చెప్పడానికి ఒక్కటైనా ఉందా? అని భూమన సవాల్‌ విసిరారు. కూటమి పా లనలో సీవీఎస్‌ఓ, జేఈఓ, స్విమ్స్‌ డైరెక్టర్‌ను కూడా నియమించలేకపోయారంటే.. మీ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుందన్నారు. స్విమ్స్‌ హాస్పిటల్‌ను నిర్వీర్యం చేస్తోంది కూటమి ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రక్షాళన అంతా డొల్ల అని మీ ఎల్లో పత్రికనే రాసిందని ఎద్దేవా చేశారు. సీఎం నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు.. సమర్థుడు అయిన అధికారులను వెంటనే తీసి వేయమని చెప్పడం ఏమిటని భూమన ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పిన డిప్యూటీ సీఎం ఎక్కడ? అని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో తప్పు జరిగిందా..? ఈ పది నెలలు కాలంలో అపవిత్రం జరిగిందా? అనే అంశంపై తాము చర్చకు సిద్ధం అని భూమన సవాల్‌ విసిరారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు శ్రీవేంకటేశ్వరస్వామిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారుస్తున్నారని, ఇందుకు ఆగమశాస్త్ర సలహాలు తీసుకోవాలని చెప్పడం దారుణం అని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని వైఎ స్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం రోజు రోజుకు దిగజార్చుతోందని మండిపడ్డారు. చైన్నెలో జీ స్క్వేర్‌ సంస్థ సొంత నిధులతో ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం ఎంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్‌ అభ్యంతరం చెప్పినా సీఎం చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కలియుగదైవం వేంకటేశ్వరస్వామివారిని, టీటీడీని ప్రమోటర్‌గా చేసే ప్రయ త్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు దేశ వ్యాప్తంగా వెంచర్లు ఉన్నాయని, సొంత నిధులతో ఇలానే దేవాలయాలు నిర్మాణం చేస్తామని ముందుకు వచ్చి, వాళ్ల వ్యాపారం పెంచుకుంటారన్నారు. సొంత ఖర్చులతో టీటీడీ ఆలయాలు కడితే తప్పు ఏమిటని సాక్షాత్తు సీఎం అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

కాళ్లా వేళ్లా పడి విచారణ ఆపుకోలేదా?

వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించి హోమ్‌ శాఖ నుంచి విచారణకు జారీ చేసిన ఆదేశాలను కాళ్లా వేళ్లా పడి ఆపుకోలేదా?.. ఇది నిజం కాదా? అని భూమన నిలదీశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగ లేదన్నారు. దేశంలో ఉన్న మఠాధిపతులతో తాము సమావేశం నిర్వహించామని, ఇతర మతాలు నుంచి తిరిగి హిందువులుగా మారేందుకు ఒక వేదిక ఏర్పా టు చేయాలని వైఎస్సార్‌సీపీ పాలనలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని భూమన గుర్తు చేశారు. హిందూమతంలో చేరేవారికి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఇప్పించాలని నిర్ణయించామని, దీనిపైనా నాడు టీడీపీ రాజకీయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చిన్న పిల్లలు గోవిందా కోటి రాస్తే వారికి శ్రీవారి దర్శన అవకాశం కల్పించింది వైఎస్సార్‌సీపీ పాలనలోనేనని స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వర దివ్యానుగ్రహహోమం కార్యక్రమం తామే నిర్వహించామని, ఇప్పటికీ అత్యద్భుతంగా జరుగుతోందన్నారు. అయినా ఆ విషయాన్ని కూడా కూటమి పాలనలోనే జరుగుతున్నట్లు చెప్పుకోవడం దారుణమన్నారు. ఈ పది నెలలు పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనిలేదని ఆరోపించారు. వేంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే అపచారం అవుతుందన్నారు. చిత్తశుద్ధితో ఆలయ ప్రతిష్ట పెంచేందుకు పనిచేయాలని హితవుపలికారు.

టీటీడీ ప్రతిష్ట దిగజార్చుతున్నారు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి టీటీడీ ప్రతిష్టను మరింతగా దిగజార్చుతున్నారని భూమన ఆందో ళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ పార్టీ నేత లు, భక్తులే అంటున్నారని చెప్పారు. లడ్డూ వివాదం మొదలుకొని నేటి వరకు అన్నీ అపచారాలే అన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ పాలనపై చేసిన ఆరోపణలకు సీబీఐ, సిట్‌ ఒక్క ఆధారం చూపించలేదన్నారు. కూటమి పాలనపై సాధువులు, స్వాములు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట, తిరుమలలో ఆందోళన చేయ లేదా? అని నిలదీశారు. తిరుమలలో బాలాజీ నగర్‌, ఇతర ప్రాంతాల్లో మద్యం, మాంసం విచ్చలవిడిగా అమ్ముతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యమతస్తుడు తిరుమల కొండకు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా వెళ్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement