రెడ్‌బుక్ రాజ్యాంగం దుర్మార్గం
నాయుడుపేటటౌన్: కూటమి నాయకులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహస్తున్నారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మండిపడ్డారు. నాయుడుపేట పట్ట్టణంలోని సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో గురువారం వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రజలకు అండగా నిలిచి, కూటమి నాయకుల దౌర్జన్యాలు, ఆరాచాకా లు అడ్డుకోవడాన్ని తట్టుకోలేక కాకాణిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల దౌర్జనాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అణిచివేసే చర్యలు చేపట్టడడం ఎంతవరకు సమంజసమని ని లదీశారు. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు కావసున్నా, వారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమ లు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. సంక్షేమాన్ని గాలికి వదలి, కేవలం వైఎస్సార్ సీపీ నాయకులనే టార్గెట్ చేసుకుని పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పాలు ఇచ్చే గేదెను వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. జమిలి ఎన్నికలు వస్తే కూటమి నాయకులను ప్రజలు తరిమికొడతారన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే పని పాలన సాగిస్తుందని, ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయుడుపేట పట్టణ, మండల కన్వీనర్లు కలికి మాధవరెడ్డి, ఒట్టురు కిషోర్ యాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కటకం దీపిక, పార్టీ మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి కురుగొండ ధనలక్ష్మి, నియోజవర్గ కన్వీనర్ ఈదా రత్నశ్రీ , ఏఎంసీ మాజీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి, కట్టా కమలకర్‌రెడ్డి, చదలవాడ కుమార్, దారా రవి, పాలేటి నాగార్జున, మండల కన్వీనర్లు పాదర్తి హరినాఽథ్‌రెడ్డి, ఆర్ముగం, పేట చంద్రారెడ్డి, షేక్ షబ్బీర్, వరకళా చంద్ర, రహమాతుల్లా, కింగ్స్‌వే జిలానీ, ఆశోక్ కుమార్, పేర్నాటి రాహుల్, ఆర్కాట్ శాంత కుమార్, మెస్ భాస్కర్‌రెడ్డి, అనపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
● మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య


