రాజల సీమ కీర్తి
ఆధ్యాత్మికపురి..
నేటితో జిల్లాకు మూడేళ్లు
● 34 మండలాలు..ఏడు నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు ● జిల్లాకు సముద్రతీరం ● 2022 ఏప్రిల్ 4న తిరుపతి జిల్లా ఏర్పాటు
జిల్లా సమాచారం
మండలాలు 34
పంచాయతీలు 774
రెవెన్యూ డివిజన్లు 4
నియోజకవర్గాలు 7
పార్లమెంట్ స్థానం 1
సముద్రతీరం 72 కిలోమీటర్లు
తిరుపతి అర్బన్: ప్రాచీన నేపథ్యం.. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాతికపురి తిరునగరి ప్రముఖ పుణ్యక్షేత్రంగా, విద్యాకేంద్రంగా విరాజిల్లింది. కాలక్రమంలో తిరుపతిగా రూపుదిద్దుకుంది. ఈ నగరం మూడేళ్ల కిందట జిల్లా కేంద్రంగా అవతరించింది. దీంతో పూర్వపు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తిరుపతి జిల్లాలో కలవడంతో ఆధ్యాత్మిక నగరికి సముద్రతీరం, షార్ కూడా వచ్చి చేరింది. అ న్ని హంగులతో దేశంలోనే ఓ ప్రత్యేక, విశిష్ట జిల్లా గా విరాజిల్లుతోంది.
పరిపాలన సౌలభ్యం కోసం
పరిపాలన సౌలభ్యం కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4వ తేదీన జిల్లాల పునర్విభజనలో భాగంగా తిరుపతి జిల్లా ఏర్పాటు అయ్యింది. టీటీడీకి చెందిన శ్రీపద్మావతి అతిథి గృహాన్ని కలెక్టరేట్ కార్యాలయానికి కేటాయించారు. గత సర్కార్ తీసుకున్న చక్కటి నిర్ణయంతో జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉందని తమ మనస్సులో మాటను వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టరేట్‌లోనే కార్యాలయాలు
కలెక్టరేట్‌కు వెళితే అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండడంతో ఇబ్బందులు లేకుండా అన్ని పనులు చూసుకురావడానికి సౌకర్యంగా ఉంది. గత సర్కార్ ముందుచూపులో చక్కటి అలోచన చేశారని భావిస్తున్నాం. గతంలో మూడు కార్యాలయాల్లో పనులు ఉంటే ఒక రోజు మొత్తం సరిపోయేది కాదు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా సులువుగా ఉంది.
– జగదీష్‌రెడ్డి, సత్యవేడు
ఎంతో అనుకూలం
ఒకేచోట అన్ని కార్యాలయాలు ఉండడంతో అందరికీ ఎంతో అనుకూలంగా ఉంది. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు పలు కార్యాలయాలకు వెళ్లడానికి నానా తిప్పలు పడేవారు. అయితే కలెక్టరేట్‌లోనే అన్ని కార్యాలయాలు ఉండడంతో ఎంతో అనుకూలంగా ఉందని భావిస్తున్నాం. దానికితోడు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో పద్మావతి అతిథి గృహాన్ని ఎంపిక చేయడంతో విశాలమైన భవనం నేపథ్యంలో ఎంతో సౌకర్యంగా ఉంది. – వెంకటేష్, రేణిగుంట
రాజల సీమ కీర్తి


