సారా నిర్మూలనకు నవోదయ 2.0
తిరుపతి క్రైం: సారా నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశించారు. తిరుపతి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎకై ్సజ్ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధ్యాత్మిక జిల్లాలో సారా నిర్మూలించడంలో నవోదయ 2.0 కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేయాలన్నారు. ప్రత్యేకంగా గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి దృష్టి పెట్టాలని సూచించారు. కల్తీ మద్యం విషయంలోనూ సీరియస్‌గా వ్యవహరించాలని చెప్పారు. చిత్తూరు డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్, అసిస్టెంట్ కమిషనర్లు శ్రీనివాసాచారి, బాలకృష్ణన్, తిరుపతి, చిత్తూరు జిల్లాల సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ వాసుదేవచౌదరి పాల్గొన్నారు.
నీటి కోసం నిరసన
తిరుపతి అర్బన్: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వెంటగిరి మండలం, పెట్లూరు గ్రామం సీతారాం ఏచూరి నగర్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌కు చేరుకుని తమ ఆనేదన వెళ్లగక్కారు. కాలనీకి తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేదని వాపోయారు. తమ కాలనీ అభివృద్ధికి అటవీశాఖ అధికారులు అడ్డుగా నిలుస్తున్నారని ఆరోపించారు. వారికి సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజుతోపాటు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శి మునిరాజ, రమణయ్య తదితరులు అండగా నిలిశారు. అనంతరం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
సారా నిర్మూలనకు నవోదయ 2.0


