కూటమి అధినేతల మాస్క్‌లతో వైఎస్సార్‌సీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

కూటమి అధినేతల మాస్క్‌లతో వైఎస్సార్‌సీపీ నేతలు

Apr 5 2025 12:14 AM | Updated on Apr 5 2025 12:14 AM

కూటమి పాలనలో చావే శరణ్యం అంటూ

ఉరి వేసుకుంటున్న రైతు

మాట్లాడుతున్న భూమన అభినయ్‌రెడ్డి

విద్యుత్‌ చార్జీల భారం కారణంగా పాపం ప్రజలు ఏమంటున్నారో విందాం రండి

సాధారణ గృహిణి

తల్లికి వందనం అంటే వంచన అని తెలుసుకున్నాం. ప్రతి బిడ్డకీ రూ.15 వేలు అంటే.. అరచేతిలో స్వర్గమని అర్థమైంది. జగనన్న ఉండి ఉంటే జూన్‌లోనే డబ్బులు పడేవి. చంద్రబాబు పథకాలు ఇస్తానని చెవిలో పువ్వు పెట్టాడు. కరెంటు చార్జీలు పెంచి వైర్లలో షాక్‌ ఇస్తున్నాడు ఈ చంద్రన్న. అప్పులు చేసి కరెంటు బిల్లు కడుతున్నాం. చెప్తుండా వినండి చంద్రన్న ఎప్పుడొచ్చినా జనాలకి షాక్‌ ట్రీట్మెంట్‌ తప్పదు.

భూమన అభినయ్‌ :

బాబు గారి హయాంలో వ్యాపారస్తుడి బాధ ఎలా ఉందో చూద్దాం రండి..

వ్యాపారిః

బాబన్న వస్తే జేబు అంతా ఖాళీ. రూ.1,500 బిల్లు వచ్చేది. ఇప్పుడు అదే బిల్లు రూ.15 వేలయ్యింది. దేవుడికే నామం పెట్టే నారావారి పాలన.. జనం నమ్మకానికి అవహేళన.

అభినయ్‌:

రైతు దేశానికి వెన్నెముక అంటారు మరి కూటమి ప్రభుత్వంలో రైతు ఎంత దీనంగా ఉన్నాడో చూద్దాం రండి..

రైతు:

‘పెట్టుబడి సాయం ఇస్తానని రైతులకి పంగనామాలు పెడుతున్నాడు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో చావబాదుతున్నాడు. ఆయనకి పవర్‌ వచ్చిందంటే మనకి పవర్‌ బిల్లు పెరిగిందని అర్థం..’ అంటూ రైతు వేషధారి ఉరితాడు తగిలించుకుని రైతు ఆత్మహత్యల గురించి రైతు వేషధారణలోని పాపిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు.

కూటమి అధినేతల మాస్క్‌లతో వైఎస్సార్‌సీపీ నేతలు 1
1/1

కూటమి అధినేతల మాస్క్‌లతో వైఎస్సార్‌సీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement