పీఓఈఎం–04 శకలాలు సముద్రంలోకి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత ఏడాది డిసెంబర్ 30న పీఎస్‌ఎల్‌వీ సీ60 ద్వారా స్పేడెక్స్ ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ తరువాత నాలుగో దశలోని పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పరమెంట్ మాడ్యూల్(పీఓఈఎం–04) తన పనిని పూర్తిచేసింది. తదనంతరం దాని శకలాలను శనివారం ఉదయం 8.03 గంటలకు హిందూ మహాసముద్రంలో పడదోసినట్టు ఇస్రో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ల సిరీస్‌లో పీఓఈఎం–4 అంటే నాలుగో దశతో కొన్ని పేలోడ్స్ వివిధ రకాల కక్ష్యల్లో ప్రవేశపెట్టి కొత్తరకం కక్ష్యలను అన్వేషించింది. ఈ క్రమంలో ఇప్పటికి నాలుగు పీఓఈఎంలను ప్రయోగించగా పీఎస్‌ఎల్‌వీ సీ60కి అమర్చిన పీఓఈఎం మాత్రం 1000 రకాల కక్ష్యలను పూర్తి చేసి 24 పెలోడ్స్‌ను వివిధ రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి తన పనిని పూర్తిచేసింది. పీఓఈఎం–4 ఇంజిన్ 55.2 డిగ్రీల వంపుతో భూమికి 350 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యను తొలగిచింది. దీంతో ప్రమాదవశాత్తూ విచ్ఛిన్నమయ్యే సంభావ్య ప్రమాదాన్ని తగ్గించేందుకు మిగిలిపోయిన అపోజి ఇంధనాన్ని బయటకు పంపడం ద్వారా పీఓఈఎం–4 శకలాలు హిందూ మహాసముద్రంలో పడిపోయే విధంగా చేయడం విశేషం.
బహుముఖ ప్రజ్ఞ
గత ఏడాది డిసెంబర్ 30న పీఎస్‌ఎల్‌సీ 60 రాకెట్ స్పేడెక్స్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత పీఓఈఎం దాని కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ దశలో మొత్తం 24 పేలోడ్స్‌ను అమర్చి పంపించిన విషయం తెలిసిందే. ఈ 24 పేలోడ్స్‌ను కచ్చితత్వంతో కూడిన కక్ష్యల్లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. పీఓఈఎం–4 ప్రయోగాత్మక ప్లాట్‌ఫామ్‌గా బహుముఖ ప్రజ్ఞను నిరూపించిందని ఇస్రో పేర్కొంది.
పీఓఈఎం–04 శకలాలు సముద్రంలోకి


