● జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు ● నెట్‌వర్క్‌ ఆస్పల్లో రోగుల అవస్థలు ● పట్టించుకోని కూటమి నేతలు | - | Sakshi
Sakshi News home page

● జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు ● నెట్‌వర్క్‌ ఆస్పల్లో రోగుల అవస్థలు ● పట్టించుకోని కూటమి నేతలు

Apr 8 2025 6:59 AM | Updated on Apr 8 2025 6:59 AM

● జిల

● జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు ● నెట్‌వర్క్‌ ఆస్

ఎప్పటి నుంచి పెండింగ్‌

12 నెలలుగా

రోజూ ఆరోగ్యశ్రీ ఓపీలు

1,456

ఆశ్రయిస్తున్న రోగులు

2వేల మందికి పైగా

తిరుపతి తుడా: ఆరోగ్యశ్రీకి ముసలం పట్టుకుంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. వైద్యం అందక పేద రోగులు అల్లాడిపోతున్నారు.

తిరుపతి జిల్లాలో 38 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలందిస్తున్నారు. పేరుకుపోయిన బకాయిలు ఏప్రిల్‌ 6వ తేదీలోపు చెల్లించాలని ఆయా ఆస్పత్రుల నిర్వాహకులు ఆల్టిమేటం జారీ చేశారు. కానీ కూటమి నేతలు పట్టించుకోలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ ముందస్తుగా ప్రకటించిన మేరకు సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. వైద్యం కోసం వచ్చిన పేద రోగులు వెనుదిరుగుతున్నారు.

బకాయిలు విడుదల చేస్తేనే

జిల్లా వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు గత 12 నెలలుగా రూ.220 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. వీటిని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లిస్తేగానీ ఆరోగ్యశ్రీని కొనసాగించలేమని ఆస్పత్రుల నిర్వాహకులు తేల్చిచెప్పారు. రూ.10 కోట్లు రావాల్సిన ఆస్పత్రులకు రూ.50 లక్షలు విడుదల చేస్తే ఎలా నడపాలని ఆవేదన చెందుతున్నారు.

వెలవెలబోయిన ఆరోగ్యశ్రీ కౌంటర్‌

ఆరోగ్యశ్రీ మాటెత్తితే మండిపడుతున్నారు

మాది రేణిగుంట. నేను తిరుపతి నగరంలోని ఓ చెప్పుల షాపులో కూలీగా పనిచేస్తున్నాను. నాకు రెండుకాళ్లు వాచిపోయాయి. కిడ్నీలు దెబ్బతిన్నాయనే అనుమానం ఉంది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు చూపించా. అక్కడున్న సిబ్బంది దయచేసి వెళ్లిపోండి అని చెప్పారు. నేను నా భార్య బతిమలాడినా వినిపించుకోలేదు. చేసేది లేక ఇంటికి వచ్చేశాం.

–రమణాచారి, మంగళం, తిరుపతి

అయోమయంలో రోగులు

ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు చెల్లించని పక్షంలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు పూర్తిగా పేదలకు దూరంకానున్నాయి. ఇప్పటికే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో రోగులు అడ్మిషన్లు తీసుకుని ఉన్నారు. మరికొందరు శస్త్ర చికిత్సలు చేసుకుని వైద్యసేవలు పొందుతున్నారు. ఇంకొందరు ఆరోగ్యశ్రీ అనుమతుల కోసం బెడ్‌లపై నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఉన్నపళంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేద రోగుల పరిస్థితి అయోమయంలో పడింది. వెంటనే బకాయిలు చెల్లించి పేద రోగులకు ఆరోగ్యశ్రీ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

● జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు ● నెట్‌వర్క్‌ ఆస్1
1/1

● జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు ● నెట్‌వర్క్‌ ఆస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement