టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో తృతీయ స్థానం
తిరుపతి ఎడ్యుకేషన్ : పిడుగురాళ్లలో ఈ నెల 5, 6 తేదీల్లో అండర్–19బాలబాలికల రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు తిరుపతి జిల్లా నుంచి బాలబాలికల జట్లు హాజరయ్యాయి. ఈ పోటీల్లో జిల్లా బాలబాలికల జట్లు తృతీయ స్థానంలో నిలిచి ట్రోఫి, మెడల్స్‌ను అందుకున్నాయి. బాలికల విభాగంలో బెస్ట్ బ్యాట్స్ ఉమన్‌గా ఎ.రేష్మ, బాలుర విభాగంలో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా పోలరాజ్, నరసింహలు ప్రశంలందుకున్నారు. ప్రతిభ చాటిన బాలబాలికల జట్లను జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఎ.దేవరాజ్, కార్యదర్శి బి.మనోహర్, కోచ్ హరినాథ్ అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు లక్నోలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు.
టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో తృతీయ స్థానం


