సంస్కరణల పేరిట సర్వనాశనం!
నాగలాపురం: విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రస్టు పట్టిస్తోందని.. సంస్కరణల పేరిట సర్వనాశనం చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరంగా ఉన్న స్కూళ్లకు తమ పిల్లలను పంపించలేమంటూ మండలంలోని చిన్నాపట్టు, గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద సోమవారం పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టారు. చిన్నాపట్టు పాఠశాల వద్దకు వెళ్లిన ఎంఈఓ బాబయ్యను విద్యార్థులు, తల్లిదండ్రులు చుట్టుముట్టి తమ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఊరికి దూరంగా వేరే పాఠశాలకు తమ పిల్లలను పంపలేమని చెప్పారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే నూతన సంస్కరణలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.
చిన్నాపట్టు, గోపాలపురంగ్రామస్తుల ఆందోళన


