● సమయాభావం తక్కువంటూ పెదవి విరుస్తున్న వైనం ● వయోపరిమిత
హడావుడి
డీఎస్సీపై
అభ్యర్థుల
అసహనం
హడావుడి తప్పదు
లక్షల మందిని ఎదర్కొని ఉద్యోగం సాధించాలంటే సిలబస్‌ను పూర్తి స్థాయిలో చదవాల్సి ఉంటుంది. హడావుడిగా చదివి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడం పేద, సామాన్య విద్యార్థులకు కష్ట సాధ్యం. కోచింగ్‌లు, లేటెస్ట్ పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ అతితక్కువ సమయంలో సమకూర్చుకోవడం అసంభవం. దీంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. మా లాంటి పేద విద్యార్థులు లైబ్రరీలపైనే ఆధారపడతాం. అలాంటి వారికి సమయం మూడు నెలలు ఇచ్చి ఉంటే బాగుండేది.
–నాగభూషణం, ఎమ్మెసీ, బీఈడీ, డీఎస్సీ అభ్యర్థి, తిరుపతి
ప్రిపరేషన్ ఎలా?
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ప్రిపరేషన్‌కు తక్కువ సమయం ఇస్తూ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం బాధాకరం. లక్షల మంది పోటీ పడే పరీక్షకు కేవలం 45 రోజుల సమయం ఇవ్వడం విడ్డూరంగా ఉంది. కనీసం మూడు నెలలు సమయం కేటాయించాల్సి ఉంది. పేద విద్యార్థులు డీఎస్సీకి అవసరమైన పుస్తకాలను సమకూర్చుకుని ప్రిపరేషన్ ప్రారంభించేందుకు కనీసం పది రోజుల సమయం పడుతుంది. ఇక మిగిలేది 30 రోజులు మాత్రమే. ఆ తక్కువ సమయంలో డీఎస్సీలో నెగ్గాలంటే కష్టమే.
–ఎస్.చిన్న, ఎంఏ ఎంఈడీ, డీఎస్సీ అభ్యర్థి, తిరుపతి
మూడు నెలలు అవసరం
లక్షల్లో పోటీ పడే డీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే కనీసం మూడు నెలల సమయం అవసరం. విస్తృత సిలబస్ 45 రోజుల్లో పూర్తి చేయడం అసంభవం. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించి, ఏడాదిగా కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల చేస్తారో లేదో అని నీరసించిపోయారు. వారు సైతం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారు. హడావుడిగా పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదు.
–కే.ప్రవళ్లిక, ఎమ్మెస్సీ బీఈడీ, డీఎస్సీ అభ్యర్థి, తిరుపతి
● సమయాభావం తక్కువంటూ పెదవి విరుస్తున్న వైనం ● వయోపరిమిత
● సమయాభావం తక్కువంటూ పెదవి విరుస్తున్న వైనం ● వయోపరిమిత


