జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఏ.రంగంపేట విద్యార్థులు
చంద్రగిరి: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. మే 1 నుంచి 68వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొని సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు. ఏ.రంగంపేట గ్రామానికి చెందిన పునీత్‌రాజ్‌కుమార్, పూజ ఏ.రంగంపేట ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. మూడేళ్లుగా పీడీ డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలో ఫుట్‌బాల్ క్రీడలో మెలకువలు నేర్చుకున్నారు. గత అక్టోబర్‌లో హిందూపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో వారిద్దరూ జాతీయ స్థాయి పోటీలకు, మరో 20 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను హెచ్‌ఎం మదన్‌మోహన్‌తో పాటు గ్రామస్తులు అభినందించారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో మే 1 నుంచి జాతీయ ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొననున్నట్టు పీడీ ప్రభార్ తెలిపారు.
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఏ.రంగంపేట విద్యార్థులు


