మూలకాల సద్వినియోగంలో చైనాను అధిగమిద్దాం
తిరుపతి సిటీ: అరుదైన మూలకాలను సద్వినియోగం చేసుకోవడంలో చైనాను అధిగమించాల్సి ఉందని హైదరాబాద్ నేషనల్ జియో లాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీ.బలరాం తెలిపారు. ఎస్వీయూ ఫిజిక్స్, పద్మావతి వర్సిటీ బయోటెక్నాలజీ విభాగాలు సంయుక్తంగా సైన్‌న్స్, టెక్నాలజీ అండ్ అప్లికేషన్ ఆఫ్ రేర్ ఎర్‌త్స్ అనే అంశంపై మంగళవారం రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో అరుదైన వనరులు లభ్యమవుతున్నాయని, అరుదైన మూలకాలను వెలికి తీసే పద్ధతుల్లో మార్పుచేర్పులు అవసరమన్నారు. సాంకేతిక వినియోగం మరింతగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యురేనియం వంటి అరుదైన మూలకాలును వెలికి తీయడంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. అనంతరం హైదరాబాద్ బిట్స్ ఫిలానీ ప్రతినిధి డాక్టర్ బీఎం రెడ్డితో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, రీసర్చ్ సెంటర్ల పరిశోధకులు, ఓరల్, పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్ చేశారు. వీరిని నిర్వాహకులు సత్కరించారు. రేర్ ఎర్‌త్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దీపేంద్రసింగ్, కార్యదర్శి డాక్టర్ ఎమ్మెల్పీ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సీకే జయశంకర్, అంతర్జాతీయ సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ బీ.దేవప్రసాద్‌రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ ఎన్.జాన్‌సుష్మా పాల్గొన్నారు
మూలకాల సద్వినియోగంలో చైనాను అధిగమిద్దాం


