మిన్నంటిన ఆర్తనాదాలు
● ప్రయివేటు బస్సు బోల్తా ఘటనలో తల్లడిల్లిన బాధితులు ● అంబులెన్స్ ఆలస్యం కావడంతో రోడ్డుపైనే క్షతగాత్రులు
(రేణిగుంట శ్రీకాళహస్తి రూరల్): బాధితులు తల్లడిల్లిపోయారు. రక్తగాయాలతో ఆర్తనాదాలు పెట్టారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. వివరాలు.. రేణిగుంట మండలం, మర్రిగుంట సర్కిల్‌లో మంగళవారం ఉదయం 7.40 గంటలకు ఓ ప్రయివేటు కంపెనీ బస్సు, ట్రాక్టర్ అతివేగంగా వచ్చి అదుపుతప్పి బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 45 మంది ఉద్యోగుల్లో 30 మంది మహిళా ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బోల్తా పడిన బస్సు నుంచి బాధితులను స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. కానీ క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌లేవీ అందుబాటులో లేవు. సుమారు అరగంటపాటు రోడ్డుపైనే రక్తగాయాలతో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. ఆపై సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
రాంగ్ రూటే ప్రమాదానికి కారణం!
మర్రిగుంట సర్కిల్ నుంచి విమానాశ్రయ పాత రహదారిలోకి వెళ్లేందుకు సుమారు 500 మీటర్ల వరకు వన్‌వే ఉంది. తొందరగా గమ్యానికి చేరాలన్న ఉద్దేశంతో సర్కిల్ నుంచి వన్ వేలో వాహనాలను నడుపుతుంటారు. ఆ క్రమంలో హైవేలో అతివేగంగా వచ్చే వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇలాంటి ఘటనలే గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. వన్‌వే ఉన్న ప్రాంతంలో కనీసం నో ఎంట్రీ బోర్డులు కూడా పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
బోల్తా పడిన బస్సు, ట్రాక్టర్ ట్రాలీ
మిన్నంటిన ఆర్తనాదాలు
మిన్నంటిన ఆర్తనాదాలు
మిన్నంటిన ఆర్తనాదాలు
మిన్నంటిన ఆర్తనాదాలు


