● మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల నిరసన ● ఈస్ట్
తిరుపతి అర్బన్: కూటమి సర్కార్‌లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు హేయమైన చర్య అని తిరుపతి జర్నలిస్టులు మండిపడ్డారు. పత్రికల్లో వచ్చిన కథనాల్లో ఒకవేళ అవాస్తవాలు ఉంటే..వాస్తవాలను తెలియజేస్తూ ఖండన ఇవ్వాలే తప్ప భౌతికదాడులకు పాల్పడడం దారుణమైన చర్య అన్నారు. మంగళవారం ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడులకు పాల్పడిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు. ఆ మేరకు బుధవారం తిరుపతి బస్టాండ్‌కు సమీపంలోని జాతిపిత మహ్మాతగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మీడియాపై కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడికి నిరసన తిరుపతితోపాటు జిల్లా వ్యాప్తంగా కదం తొక్కారు. కలం కార్మికుల నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించారు. వాస్తవాలను ప్రజలకు చేరవేస్తే జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడు ఇలా అక్రమ కేసులు పెట్టడం..బెదిరింపులకు పాల్పడ డం జరగలేదని.. అయితే కూటమి సర్కార్‌లో ని త్యకృత్యమైందని మండిపడ్డారు. సాక్షి దినపత్రిక లో ప్రచురించిన వాస్తవాలను జీర్ణించుకోలేని కూ టమి ప్రభుత్వం ఇటీవల ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు మరో ఆరుగురు పాత్రికేయుల పై తప్పుడు కేసులు బనాయించిందన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం నేరమా, క లం కార్మికులపై కక్ష సాధింపులపై న్యాయం కో సం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఏకమై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో జర్నలిస్టులు దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. లేదంటే ఉద్యమాలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యనిర్వా హక కార్యదర్శి మబ్బుదేవనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో సాక్షి కార్యాలయంపై టీడీపీ ఎమ్మెల్యే దాడికి నిరసనగా తిరుపతి బస్టాండ్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పాత్రికేయులు


