టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ వితరణ
తిరుమల: మహారాష్ట్రకు చెందిన బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం రూ.1.40 లక్షల విలువైన బిగాస్ సి12 మాక్స్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీటీడీకి వితరణ చేసింది. శ్రీవారి ఆలయం ఎదుట డిప్యూటీ ఈవో లోకనాథంకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుర్గేష్ గుప్తా స్కూటర్ తాళాలు అందజేశారు. కార్యక్రమంలో తిరుమల డీఐ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
22 మంది విద్యార్థుల డిబార్
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గురువారం నుంచి ప్రారంభమైన డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల్లో తొలిరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 22 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దామ్లానాయక్ తెలిపారు. హైపవర్ ఇన్‌స్ఫెక్షన్ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లి జోన్ పరిధిలో 16 మంది, చిత్తూరు జోన్ పరిధిలో ఆరుగురు విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడగా అధికారులు వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.
అభ్యంతరాల అనంతరం
సీనియారిటీ జాబితా
చిత్తూరు కలెక్టరేట్ : ఇది వరకే పలుసార్లు విడుదల చేసిన సీనియారిటీ జాబితాల అనంతరం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జాబితా మరోసారి విడుదల చేసినట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఎస్జీటీ జనరల్ సీనియారిటీ జాబితాను మెరిట్ ఆధారంగా మేనేజ్‌మెంట్ వారీగా రూపొందించినట్లు చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఆ జాబితాల్లో వచ్చిన అభ్యంతరాలను సరిచేసి, సవరించిన ఎస్జీటీ జనరల్ సీనియారిటీ జాబితాను చిత్తూరు డీఈవో.కామ్ (www.chiŠosŒæorrdoe.com) వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఈఓ వెల్లడించారు.


