వేడుకగా సీఎంఆర్‌ జ్యువెలరీ ఎక్స్‌క్లూజివ్‌ షోరూం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వేడుకగా సీఎంఆర్‌ జ్యువెలరీ ఎక్స్‌క్లూజివ్‌ షోరూం ప్రారంభం

Apr 25 2025 11:34 AM | Updated on Apr 25 2025 11:34 AM

వేడుకగా సీఎంఆర్‌ జ్యువెలరీ ఎక్స్‌క్లూజివ్‌ షోరూం ప్రారం

వేడుకగా సీఎంఆర్‌ జ్యువెలరీ ఎక్స్‌క్లూజివ్‌ షోరూం ప్రారం

తిరుపతి కల్చరల్‌: ప్రకాశం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ జ్యువెలరీ ఎక్స్‌క్లూజివ్‌ షోరూంను గురువారం వేడుకగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీనటి మీనాక్షి చౌదరి హాజరై సీఎంఆర్‌ జ్యువెలరీ ఎక్స్‌ క్లూజివ్‌ షోరూంను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల శ్రీవారి పాదాల చెంత సీఎంఆర్‌ జ్యువెలరీ ఎక్స్‌క్లూజివ్‌ షోరూం ఆరంభించడం అభినందనీయమన్నారు. సినిమాపరంగా తాను నాగచైతన్య, నవీన్‌పోలిశెట్టితో రెండు సినిమాలు చేస్తున్నానని, ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్‌ రోల్స్‌ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీఎంఆర్‌ గ్రూప్స్‌ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ ట్రెండ్‌కు అనుగుణంగా తిరుపతిలో అతిపెద్ద బంగారు ఆభరణాల ఎక్స్‌క్లూజివ్‌ షోరూంను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. షోరూంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు 3 శాతం నుంచి ప్రారంభమవుతుందని, వెండి రెగ్యులర్‌ వస్తువులపై తరుగు మజూరీ లేదన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు ఆభరణాల వీఏ పై 25 శాతం తగ్గింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పులివర్తినాని, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, జనసేన నేత డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ప్రముఖ వ్యాపార వేత్తలు సాగర్‌, మావూరి శ్రీనివాసు, తిరుపతి క్లాత్‌ మర్చంట్‌ అండ్‌ రెడీమేడ్‌ వ్యాపారుల సంఘం కార్యదర్శి సుబ్రమణ్యం(పరదాలమణి), వివిధ వ్యాపార ప్రముఖులు పాల్గొని షోరూం అధినేత మావూరి వెంకటరమణను అభినందించారు. షోరూం అధినేత సతీమణి మావూరి పద్మావతి, కుమారుడు మోహన్‌ బాలాజీ, కోడలు హేమహారిక, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement