పార్టీ బలోపేతమే లక్ష్యం
తిరుపతి సిటీ: వైఎస్సార్‌సీపీ బలోపేతానికి విశేష కృషి చేస్తామని నూతనంగా ఎంపికై న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వి.హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. తనకు వర్కింగ్ ప్రెసి డెంట్‌గా ఎంపిక చేసినందుకు గురువారం విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హరిప్రసాద్‌రెడ్డి మట్లాడుతూ 2004 నుంచి ఎస్వీయూ వేదికగా విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశామని, వర్సిటీ అధ్యక్షులుగా, ఉమ్మడి రాష్ట్ర కో–ఆర్డినేటర్‌గా, సమైక్యాంధ్ర ఉద్యమంలో జేఏసీ కన్వీనర్‌గా ఉద్యమాలు చేశానని గుర్తుచేశారు. అలాగే 2014లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడుగా, విద్యార్థి విభాగం రీజినల్ కో–ఆర్డినేటర్‌గా పనిచేసినట్టు తెలిపారు. వైఎస్సార్‌సీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సహకరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డికి, పార్టీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తమ సేవలకు అవార్డులు
తిరుపతి అర్బన్: ఉత్తమ సేవలకుగాను జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవికి అవార్డు లభించింది. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ఆమె అవార్డు అందుకున్నారు. జిల్లాలో 2024–25 సంవత్సరానికి సంబంధించి పన్నులు రూ.53.01కోట్ల మేర వసూలు చేయాల్సి ఉండగా.. అందులో రూ.44.21 కోట్లు వసూలు చేసి, జిల్లాను రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలబెట్టారు. ఈ మేరకు ఆమెకు అవార్డు లభించింది. అలాగే ఉత్తమ సేవలందించిన జిల్లా పంచాయతీ రాజ్ అధికారి రామ్మోహన్‌కు కూడా అవార్డు లభించింది.


