Man Brutally Murdered Another Man In Doultabad, Over Doubt Of Having Crush On His Wife - Sakshi
Sakshi News home page

వివాహితపై కన్నేసి.. కోరిక తీర్చమన్నాడు.. ఇద్దరూ వెళ్లి

Published Sun, Jun 25 2023 1:26 AM | Last Updated on Mon, Jun 26 2023 2:49 PM

- - Sakshi

వికారాబాద్: తన భార్యపై కన్నేశాడని.. ఒక్కసారి తన మోజు తీర్చాలని అడిగాడనే అనుమానంతో ఓ వ్యక్తిని మద్యం తాగించి బీరు సీసా, బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సీ శేఖర్‌(32) హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ భార్య పిల్లలతో ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన బీ గోపాల్‌ నగరంలో పనిచేస్తున్నాడు. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో కలిసి కూలి పనులు చేసుకునే వారు. దౌల్తాబాద్‌లో వీరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి.

గోపాల్‌ రెండు నెలల క్రితం, శేఖర్‌ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. శేఖర్‌ తన భార్యపై కన్నేశాడని.. ఒక్క సారి మోజు తీర్చాలని అడిగినట్లు గోపాల్‌కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శేఖర్‌ ఇంటికెళ్లి గోపాల్‌ను బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరూ ఓ దాబాలో మద్యం తాగారు. అనంతరం మద్యం బాటిళ్లు తీసుకుని గుముడాల రోడ్డులోని ఓ పొలంలోకి వెళ్లారు. అక్కడ వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. గోపాల్‌ బీరు సీసా, బండరాయితో శేఖర్‌ తలపై మోది అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రాత్రి 10గంటల సమయంలో గోపాల్‌ ఒక్కడే ఇంటికి రావడంతో శేఖర్‌ భార్య నా భర్త ఎక్కడ అని ఆరా తీసింది. తనకు తెలియదు అని చెప్పాడు. అనుమానం రావడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. శేఖర్‌పై తానే దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చికిత్స నిమిత్తం కొడంగల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య ఉషంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement