భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
బుద్ధిమాంద్యం కలిగిన కుమారుడు పుట్టాడని దూరం పెట్టిన భర్త
బిడ్డతో కలిసి నిరసనకు దిగిన వైనం..
రాజేంద్రనగర్: తనలా మరో మహిళకు అన్యాయానికి గురి కావొద్దంటూ ఓ గృహిణి తన కుమారుడితో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. మానసిక వికలాంగునిగా పుట్టిన సంతానాన్ని వద్దని తనను దూరం చేశాడంటూ నిరసన వ్యక్తం చేసింది. బాధితురాలి వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన బి.ఉదయ్ భాస్కర్ వివాహం ఫతేనగర్‌కు చెందిన అలేఖ్యతో 2014లో జరిగింది. సాప్ట్‌వేర్ ఉద్యోగి అయిన భాస్కర్‌కు వివాహ సమయంలో ఘనంగా కట్న కానుకలు ఇచ్చి వివాహం జరిపించారు. 2016లో వీరికి కుమారుడు జన్మించాడు.
బాలుడు బుద్ది మాంద్యంతో పుట్టడంతో ఉదయ్ భాస్కర్ భార్యాబిడ్డలిద్దర్ని దూరం పెట్టాడు. కుమారుడు అవసరం లేదని భర్త ఉదయ్ భాస్కర్‌తో పాటు కుటుంబ సభ్యులు తెలపడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. పెద్దలతో పంచాయతీ పెట్టినా పరిష్కారం కాలేదు. వీరిద్దరి మధ్య కేసు కోర్టుకు చేరింది. ప్రస్తుతం కోర్టులో వివాదం నడుస్తుంది. తనలా మరోకరికి అన్యాయం కావొద్దంటూ తన కుమారుడితో కలిసి హైదర్‌గూడలోని భర్త ఇంటి వద్ద శుక్రవారం ఆందోళనకు దిగింది. అలేఖ్య బంధువులు సైతం మద్దతు ప్రకటిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసి భాస్కర్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment