![అనాథ చిన్నారుల పేరిట రూ.9.50 లక్షల ఎఫ్‌డీ](/styles/webp/s3/article_images/2025/02/16/15vkb93a-360018_mr-1739670575-0.jpg.webp?itok=MtZu1bC1)
అనాథ చిన్నారుల పేరిట రూ.9.50 లక్షల ఎఫ్‌డీ
దౌల్తాబాద్: పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని గోకఫసల్‌వాద్ గ్రామానికి చెందిన దంపతులు గోవిందమ్మ, వెంకటప్పలు 2017 లో పిడుగుపాటుకు మృతి చెందారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులను కో ల్పోయిన చిన్నారులకు శనివారం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.9.50లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్యాంకు పుస్తకాలను కలెక్టర్ ప్రతీక్‌జైన్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బుపై వచ్చే వడ్డీని పిల్లల చదువులకు వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్పాన్స ర్ స్కీం కింద ప్రతీ నెల రూ.4వేలు ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. అనంతరం చిన్నారులకు నోట్‌బుక్స్, పుస్తకాలు, పెన్నులు అంద జేశారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి, సూపరింటెండెంట్ వెంకటేశ్వరి, చిన్నారుల నానమ్మ బాలమ్మ తదితరులు ఉన్నారు.
ఏఆర్ పోలీసులకు మొబిలైజేషన్ శిక్షణ
అనంతగిరి: పోలీసులు విధుల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్‌లోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఏఆర్ పోలీసులకు 15 రోజుల మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రాథమిక శిక్షణలో నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకోవాలన్నారు. పోలీసులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునే అలవాటు చేసుకోవాలన్నారు. తమ విధులకు సంబంధించిన అన్ని విషయాలను మరోసారి క్లుప్తంగా నేర్చుకోవాలని, ప్రతీ ఒక్కరు క్రమశిక్షణతో ఉంటూ తమ ఆర్యోగాన్ని కాపాడుకుంటూ శాంతి భద్రతల రక్షణలో తమ పాత్రను పోషించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ టి.హనుమంతరావు, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, ఆర్‌ఐలు డేవిడ్, అజయ్, అంజత్ పాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నైట్ వాచ్‌మెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
బంట్వారం: బంట్వారం కేజీబీవీలో నైట్ వాచ్‌మెన్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి వెంకటేశ్వర్‌రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానికులైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. పదో తరగతి చదివి 25 నుంచి 55 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలన్నారు. ఏదైనా సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి శిక్షణ పొంది ఉండాలన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 18లోగా మానవ వనరుల కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ వే ణుగోపాల్ సస్పెండ్
ధారూరు: ఏసీబీకి పట్టుబడిన ధారూరు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం హైదరాబాద్ మల్టీజోన్–2 ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీచేశారు. ఈ తాఖీదులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరాయి. ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు రూ.50వేల లంచం మాట్లాడుకుని రూ.30వేలు తీసుకుంటూ ఈ నెల 11న ఏసీబీకి చిక్కిన విషయం విదిత మే. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఎస్‌ఐను నాంపల్లి కోర్టు లో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ జైలుకు వెళ్లడంతో ఆయనపై వేటుపడింది.
నేటి నుంచి ‘కులగణన’
సాక్షి, రంగారెడ్డిజిల్లా: సమగ్ర కుటుంబ/కులగణన సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు వివరాలు నమోదు చేయనుంది. టోల్ ఫ్రీ నంబర్ సహా ఆన్‌లైన్‌లో ఫాం డౌన్‌లోడ్ చేసుకుని, వివరాలన్నీ పూర్తి చేసి ఇవ్వొచ్చు. మున్సిపాలిటీలు/ మండల కేంద్రాల్లో ఎంపిక చేసిన 37 ప్రజా పాలన సేవా కేంద్రాలకు నేరుగా వెళ్లి వివరాలు సమర్పించొచ్చని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment