
రైతుల ఖాతాల్లోకి భరోసా
బషీరాబాద్: యాసంగి పంటకు ‘రైతు భరోసా’నిధులను సర్కారు కర్షకుల ఖాతాల్లో జమ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వానాకాలం పంటకు రైతు భరోసా అందలేదు. ఈ ఏడాది జనవరి 26న ప్రభుత్వం నూతనంగా నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. తొలుత మండలానికి ఒక పైలెట్ గ్రామానికే ‘భరోసా’అందింది. వారం రోజులుగా ఎకరం రైతు మొదలుకొని మూడు ఎకరాల వరకు భరోసా సాయం ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో 2,75,513 రైతులకు చెందిన 1,14,492 ఎకరాల సాగు భూమికిగాను రూ.344,66,23,099 పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. 1,70,383 రైతులకు రూ.136,48,29,701 నిధులు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) విజయవతం అయిందని అధికారులు వివరించారు. మార్చి చివరి నాటికి అర్హులైన అన్నదాతల అన్ని ఖాతాల్లో భరోసా నిధులు జమచేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
1.70 లక్షల మంది అకౌంట్లలో నగదు జమ
మార్చి చివరి నాటికి పూర్తి
Comments
Please login to add a commentAdd a comment