అర్హులందరికీ సంక్షేమం
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
● చెంచుపల్లిలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ
పూడూరు: అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలో అంగడి చిట్టెంపల్లి, పూడూరు, మిర్జాపూర్, ఎన్కేపల్లి, చెంచుపల్లి, పెద్ద ఉమ్మెంతాల్ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. రూ.3.20 కోట్లతో నిర్మించిన గోదాములను ప్రారంభించారు. అనంతరం పూడూరు మండల కేంద్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఎన్కేపల్లి అనుబంధం గ్రామంలో చెంచుపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సత్తయ్య, కాంగ్రెస్ పూడూరు మండల అధ్యక్షుడు సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ సతీశ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, వెంకటేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, పెంటయ్య, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, అజీమ్ పటేల్, షకీల్, అబ్రహం, పూడూర్ పీఏఐసీఎస్ వైస్ చైర్మన్ వీరయ్య గౌడ్, డైరెక్టర్లు శ్రీశైలం గౌడ్, చెన్నయ్య గౌడ్, రాములు నాయక్, సురేష్, నరసమ్మ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment