
ఎండలు ‘మండే’న్!
బషీరాబాద్: ఇంక శివరాత్రి రాలేదు.. మార్చి మొదలే కాలేదు.. కానీ సూర్యుడి వేడిమి సుర్రుమంటోంది. ఫిబ్రవరి రెండో వారంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజులుగా ఉదయం 10గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. సోమవారం మర్పల్లి మండల కేంద్రంలో 37.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. కనిష్టంగా దుద్యాలలో 23 డిగ్రీలు రికార్డయింది. జిల్లాలోని మర్పల్లి, బంట్వారం, మోమిన్‌పేట, ధారూరు, పూడూరు, వికారాబాద్, యాలాల, కోట్‌పల్లి, పెద్దేముల్, తాండూరు, దౌల్తాబాద్, నవాబ్‌పేట, బషీరాబాద్ మండలాల్లో 40 డిగ్రీల లోపు ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 మండలాల్లోని 18 ప్రాంతాల్లో జిల్లా వాతావణ శాఖ అధికారి అశోక్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చిన్నారులు, వృద్ధులు మధ్యాహ్నం రోడ్లమీదకు రావద్దని సూచిస్తున్నారు. ఎండల తీవ్రతకు జనం శీతల పానియాలకు ఎగబడుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బోరుబావుల్లో ఐదు ఫీట్ల వరకు భూగర్భ జలాలు దిగిపోయాయి.
సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం గరిష్టం కనిష్టం
(డిగ్రీల్లో) (డిగ్రీల్లో)
మర్పల్లి 37.9 26.5
బంట్వారం 37.6 27.1
మోమిన్‌పేట 37.4 27.9
ధారూరు 36.8 27.6
పూడూరు 36.6 29.3
వికారాబాద్ 36.4 24.0
యాలాల 35.8 24.4
కోట్‌పల్లి 35.8 23.5
పెద్దేముల్ 35.6 24.8
తాండూరు 35.5 24.4
దౌల్తాబాద్ 35.3 26.5
నవాబుపేట 35.2 25.7
బషీరాబాద్ 35.1 21.2
ఉదయం పది గంటలకే భానుడి భగభగలు
పడిపోతున్న భూగర్భ జలాలు
13 మండలాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లా వాతావరణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment