
వైభవోపేతం.. ప్రతిష్ఠాపనోత్సవం
మర్పల్లి: మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో మూడు రోజులుగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా గ్రామస్తులు చేపట్టారు. చివరి రోజైన ఆదివారం ప్రత్యేకంగా వేదపండితుల సమక్షంలో హోమం కార్యక్రమం నిర్వహించి గర్భ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వైభవోపేతం.. ప్రతిష్ఠాపనోత్సవం
Comments
Please login to add a commentAdd a comment