మగ్గం పనిలో ఉచిత శిక్షణ
శంషాబాద్ రూరల్: స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మగ్గం పనిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ రీసెట్ డైరెక్టర్ జీఎస్‌ఆర్ కృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ముచ్చింతల్ శివారులోని ట్రస్ట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 30 రోజుల పాటు సాగే ఈ శిక్షణలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ శిక్షణకు హాజరుకావచ్చునన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్‌ః 7893121143 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ప్రాజెక్టులో బోటింగ్ చేస్తున్న యువత
Comments
Please login to add a commentAdd a comment