
బాబోయ్ ఎండలు!
● జిల్లాలో ప్రచండ భానుడి భగభగలు ● 19 మండలాల్లో ఎల్లో అలర్ట్ ● గరిష్ట ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలుగా నమోదు ● ఉదయం 11 గంటల నుంచే వడగాల్పులు
బషీరాబాద్: జిల్లాలో ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. వారం రోజులుగా 38 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు సోమవారం జిల్లాలోని మర్పల్లి, బంట్వారం మండలాల్లో 39.8 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దోమలో కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా రికార్డయ్యింది. ఈ సీజన్‌లో మొదటి సారి జిల్లాలోని 19 మండలాల్లోని 29 ప్రాంతాల్లో 35 నుంచి 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా వాతావరణ శాఖ అధికారి అశోక్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉదయం 11 గంటలకే వడగాలులు ప్రారంభం కావడంతో జనం రోడ్లమీదకు రావడానికే భయపడుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రతకు జనం శీతల పానీయాలకు ఎగబడుతున్నారు. పుచ్చకాయలకు గిరాకీ పెరిగింది.
ఉష్ణోగ్రతలు డిగ్రీలలో..
ప్రాంతం గరిష్టం కనిష్టం
మర్పల్లి 39.8 29.0
బంట్వారం 39.8 30.7
చౌడాపూర్ 39.3 29.9
వికారాబాద్ 39.0 26.1
యాలాల 38.6 26.5
తాండూరు 38.3 26.1
ధారూరు 38.1 29.3
పెద్దేముల్ 38.0 27.7
మోమిన్‌పేట 37.9 31.8
పూడూరు 37.8 30.6
బషీరాబాద్ 37.8 24.8
దౌల్తాబాద్ 37.3 29.8
కోట్‌పల్లి 37.3 25.2
కుల్కచర్ల 37.1 29.6
కొడంగల్ 37.1 21.8
నవాబుపేట 36.9 28.5
బొంరాస్‌పేట 36.6 24.6
దుద్యాల్ 36.5 22.1
పరిగి 36.4 29.2
దోమ 35.4 27.0
Comments
Please login to add a commentAdd a comment