
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాలు ● పరీక్షలు రాయనున్న 16,439 మంది విద్యార్థులు
తాండూరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు ము మ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 5నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 82 ప్రభు త్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు.. 16,439 మంది విద్యార్థులు ఉన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 29 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు 10 మంది కస్టోడియన్లు, రెండు ఫ్లయింగ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 29మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 29మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 12 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 800మంది ఇన్విజిలేటర్లను నియ మించారు. ఫస్ట్ ఇయర్‌లో 7,914మంది విద్యార్థు లు ఉండగా అందులో 6,418మంది జనరల్ కేటగిరి, 1,496మంది ఒకేషనల్ విభాగంలో పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 8,525 మంది విద్యార్థులున్నారు. జనరల్ విభాగంలో 5,589 మంది, ప్రైవేటు విభాగంలో 1,562 మంది, ఒకేషనల్ విభాగంలో 1,374 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు రావడానికి ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్, మరు గుదొడ్ల సౌకర్యం కల్పించనున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.
నిమిషం విధానం రద్దు
గతంలో పరీక్ష కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించేవారు కాదు. ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అయితే 15 నిమిషాల ముందు వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం అధికారులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఫీజు ల కోసం హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పె డుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మీ సేవ కేంద్రాల్లో కూడా హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రభుత్వం ఒక్క నిమిషం ఆలస్యం విధానాన్ని రద్దు చేసింది. పరీక్షకు 15 నిమిషాల ముందు వచ్చినా కేంద్రంలోకి అనుమతిస్తారు.
– శంకర్‌నాయక్, ఇంటర్ జిల్లా నోడల్ ఆఫీసర్

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment