
ఆలయ అభివృద్ధికి కృషి
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆల య అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే టీ రామ్మో హన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆల య కమిటీ చైర్మన్‌గా పార్థసారథి పంతులు, పాలకవర్గ సభ్యులుగా గోపాల్,సురేఖ,ఆలూరి నర్సింహు లు, పాండ్య బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వంఆలయ కమిటీ ఏర్పాటు చేయకుండా అడ్డుకుందని ఆరో పించారు. దేవాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని అతి పురాతన కిష్టమ్మగుళ్ల దేవాలయాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. కుల్కచర్ల మండలం పాంబండ ఆలయాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ది రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చే లా అభివృద్ధి చేస్తామన్నారు.శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 9,10,11వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించా రు.ప్రతి ఒక్కరూ ముందుండి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. పరిగి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ట్రిపుల్‌ఆర్ పరిగి నియోజకవర్గం మీదుగా వెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేశారన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటి పరిష్కారాని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పార్టీ ప్ర ధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ అయూబ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, దోమ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment