
● రోడ్డు ప్రమాదంలో భర్త మృతి ● పెద్దేముల్ మండలంలో ఘటన
తాండూరు రూరల్: పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకురావడానికి వెళ్లిన భర్త రో డ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈఘటన సోమవారం మండలంలోని బాయి మీదితండాలో చోటుచేసుకుంది. పెద్దేము ల్ ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. బాయిమీది తండాకు చెందిన శివరాం పవార్, చాందీబాయి దంపతుల కుమారుడు జైసింగ్ పవార్(22).
కొన్నేళ్ల క్రితం శివారం పవర్ మృతి చెందాడు. ఏడాది క్రితం జైసింగ్ పవార్‌కు పాషాపూర్ తండాకు చెందిన అనితతో వివాహ జరిగింది. గత నెల అనిత పాషాపూర్‌లో గుడిపూజ ఉన్నందున పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకరావడానికి జైసింగ్ పవార్ బైక్‌పై పాషాపూర్‌కు బయలుదేరాడు.
ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అడికిచెర్ల – పాషాపూర్ మధ్య గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో జైసింగ్ పవార్ మృతి చెందాడు. తల్లి చాందీభాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. జైసింగ్ పవార్ మృతితో బాయిమీ ది తండా, పాషాపూర్ గ్రామాల్లో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment