
ప్రతీ వారం తిరగలేకపోతున్నాం
దుద్యాల్: గత ఏడాది నవంబర్ 11న దుద్యాల్ మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి ఘటనలో నిందితులుగా ఉన్న వారు ప్రతి సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసులు మాపై ఉన్న కేసులకు సంబంధించిన చార్జిషీట్‌ను కోర్టుకు అప్పగిస్తే వారం వారం డీఎస్పీ కార్యాలయానికి తిరిగే ఇబ్బందులు తప్పుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది వయస్సు పైబడిన వారు, మహిళలు ఉన్నారని.. కూలి పనులు చేసుకుంటే తప్ప జీవనం సాగించలేరని పేర్కొన్నారు. ప్రతి వారం డీఎస్పీ కార్యాలయానికి తిరగాలంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు వాపోయారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాల ని బాధిత రైతులు కోరారు. డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన వారిలో ఏ–2 నిందితుడి సురేశ్ రాజ్, రాజునాయక్, యాదయ్య, బుగ్గప్ప, శివకుమార్ తోపాటు మరో 13 మంది ఉన్నారు.
త్వరగా చార్జిషీట్ వేయండి అధికారులను కోరిన లగచర్ల ఘటన బాధితులు
Comments
Please login to add a commentAdd a comment