
తాండూరులో 4,500 ఎకరాల్లో వరి సాగు
తాండూరు రూరల్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో యాసంగి సీజన్ ఆశాజనకంగా సాగుతోంది. రైతులు వరి సాగుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వాగుల వద్ద చెక్ డ్యాంలతో పాటు చెరువుల్లో పుష్కలంగా వర్షపు నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా బోరు మోటార్ల కింద కూడా వరిని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అంతారం, చెంగోల్, గోనూర్, అల్లాపూర్, వీర్‌శెట్టిపల్లి, నారాయణపూర్, ఎల్మకన్నె, చెన్‌గేస్‌పూర్‌తో పాటు పలు గ్రామాల్లో వరి పంటను జోరుగా సాగు చేస్తున్నారు. మండలంలో 4,500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment