
దైవభక్తితో మానసిక ప్రశాంతత
బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్
బంట్వారం: దైవ భక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు నూలి శుభప్రద్ పటేల్ అన్నారు. కోట్‌పల్లి మండల కేంద్రంలోని శివభక్త మార్కండేయ ఆలయ వార్షికోత్సవానికి ఆదివారం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీఒక్కరు దైవభక్తిని పెంపొందించుకొని సన్మార్గంలో నడవాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శుభప్రద్ పటేల్‌ను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కిటకిటలాడిన పోలేపల్లి ఆలయం
దుద్యాల్ : మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఈ నెల 21న అమ్మవారి సిడె నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక బోనాలు, కోడిపుంజులు, మేకపోతులను భక్తులు సమర్పించారు. దేవాలయం పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా భక్తులతో నిండిపోయారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని యాచకురాలి మృతి
అనంతగిరి: ఆర్టీసీ బ స్సు ఢీకొని ఓ యాచకు రాలు మృతి చెందిన సంఘటన ఆదివారం వికారాబాద్ ఆర్టీసీ బస్టాండు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వికారాబాద్ నుంచి తాండూరుకు బయలుదేరిన ఆర్డినరీ బస్సు బస్టాండు ఆవరణలోని మూలమలుపు వద్ద యాచకురాలిని(65) ఢీకొట్టింది. దీంతో బస్సు కిందపడి ఆమె నలిగిపోయి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాచకురాలి వివరాలు ఎవరికై నా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మద్యం దుకాణంలో చోరీ
రూ.2.30 లక్షల నగదు అపహరణ
పరిగి: వైన్ షాపు తాళాలు కట్ చేసి చోరీకి పాల్పడిన ఘటన పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. వైన్స్ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని భవాని వైన్స్‌లో శనివారం రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. మద్యం దుకాణం షెట్టర్ తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు కౌంటర్ లాక్‌ను విరగ్గొట్టి రూ.2.30 లక్షల నగదును, రెండు బీర్లను దొంగలించుకొని వెళ్లారు. ఆదివారం ఉదయం వైన్ షాపు తెరిచేందుకు వచ్చిన నిర్వాహకుడు దుకాణం తాళాలు విరగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూశాడు. కౌంటర్‌లోని నగదు మొత్తాన్ని దొంగలించుకు వెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ ఫూటేజీలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నారు.

దైవభక్తితో మానసిక ప్రశాంతత

దైవభక్తితో మానసిక ప్రశాంతత
Comments
Please login to add a commentAdd a comment