
వైభవంగా భద్రేశ్వరస్వామి జాతర
తాండూరు: పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఉగాది రోజు దేవాలయంలో కమిటీ సభ్యులు, వీరశైవ సమాజం ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కూడలిలో స్వామి వారి రథ చక్రాలకు పూజలు చేశారు. ఆదివారం సాయంత్రం తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, కరణం పురుషోత్తంరావు పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా భద్రేశ్వరస్వామి జాతర